Natyam ad

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..రైతు ఆత్మహత్య

నెల్లూరు ముచ్చట్లు:


ఓ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. దొరవారిసత్రం మండలం అరిమాను కండ్రిగ గ్రామానికి చెందిన మద్దూరు జగన్నాధం (30) కు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది బెదిరింపులు ఎదురయ్యాయి. ట్రాక్టర్ పై ఉన్న లక్ష రూపాయలు అప్పు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేసారు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. దాంతో జగన్నాధం మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారు. తిరుపతిరూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మా బిడ్డ ఆత్మహత్యకు ఫైనాన్స్ కంపెనీ, పోలీసులే కారణమంటున్న జగన్నాధం తల్లితండ్రులు ఆరోపించారు. వేదింపులకు పాల్పడ్డ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

 

Tags: Harassment by finance company..Farmer suicide

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.