Natyam ad

ధర్డీ ఇయర్స్ సీఎం ఫార్ములా

అక్కరకు వచ్చేనా


విజయవాడ, ముచ్చట్లు:

 

ప్రజలందరికీ మంచి చేశాం..మేనిఫెస్టోలో 98 శాతం హామీలని అమలు చేశాం..దాదాపు 89 శాతం ఇళ్లకు పథకాల ద్వారా లబ్ది చేకూరింది..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గెలిచేశాం..ప్రజలంతా మనవైపే ఉన్నారు..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేము..ఖచ్చితంగా గెలుస్తాం..అలాగే 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని జగన్ ప్రతిసారి కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు.ఎప్పటికప్పుడు ఇవే జగన్ చెబుతూ ఉన్నారు..తాజాగా విశాఖ నార్త్ స్థానం నేతలతో భేటీ అయిన జగన్..మళ్ళీ ఇదే తరహాలో మాట్లాడారు. నాయకులని మోటివేట్ చేశారు..ఇంకా మనకు తిరుగులేదనే విధంగా చెప్పుకొచ్చారు. అంటే జగన్ టార్గెట్ 175 సీట్లు, 30 ఏళ్ళు సీఎం పదవి. సరే ఆశ పడటం తప్పు లేదు..కానీ అది అత్యాశ అయితేనే ఇబ్బంది. అయితే జగన్‌ది ఆశ, అత్యాశ అనేది ప్రజలే తేల్చాలి. కాకపోతే ప్రజలకు అంతా మంచి చేస్తే..అన్నీ సీట్లు గెలిచేస్తామని కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పు లేదు.కానీ ఎంతమందికి మంచి జరిగింది..2014 ఎన్నికల్లో చంద్రబాబులాగా తాను అబద్ధాలాడి ఉంటే, ముఖ్యమంత్రిని అయ్యేవాడినేమోనని అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం తనకు లేదని, తాను ఓట్ల కోసం ప్రజలను మోసగించలేనని పేర్కొన్నారు. భవిష్యత్తు తమదేనని, అధికారంలోకి రావడం ఖాయమని, అంతిమంగా గెలిచేది న్యాయమేనని, తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశాడు.అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేసేలా తొమ్మిది కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. బాబు పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని, వారికి గిట్టుబాటు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడంలేదని, కరవు, అకాల వర్షాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.

 

 

 

Post Midle

తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ భరోసా కింద రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు అందరికీ రూ.50 వేలు ఇస్తామని, ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఏటా మే నెలలో చెల్లిస్తామని చెప్పారు. ఈ మొత్తాన్నినేరుగా రైతుల చేతికే ఇస్తామని, ఏ పంట వేయాలన్నది వారి నిర్ణయానికే వదిలేస్తామని అన్నారు.వైఎస్సార్ భరోసా కింద ప్రతి రైతుకు ఈ సాయాన్ని కుల,మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందిస్తామని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 86 శాతం మంది రైతులు అంటే 66 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, మొత్తం రూ.33 వేల కోట్లు ప్రభుత్వం తరపున చెల్లించేలా ఏర్పాట్లు చేస్తామని, రైతును మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలకు కల్పిస్తామని, రూ.2 వేల కోట్లతో కెలమిటీ ఫండ్ ఇస్తామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా, పొదుపు సంఘాలకు వైఎస్సార్ ఆసరా అనే పథకాన్ని తీసుకొస్తామని, సున్నా వడ్డీకు రుణాలిస్తామంటూ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.కేవలం పథకాల ద్వారా డబ్బులు ఇస్తే చాలా?

 

 

 

అభివృద్ధి లేకపోయినా పర్లేదా? పన్నుల భారం పెరిగిన పర్లేదా? నిత్యావసర వస్తువులు పెరిగిన పర్లేదా? కరెంట్ బిల్లులు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్నులు…ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు అవసరమైన ప్రతిదీ రేటు పెరిగిపోయింది. ఇక ప్రతిపక్షాలపై కక్ష సాధించడం, ప్రశ్నించినవాడిపై కేసు పెట్టడం…ఇంకా రకరకాలుగా దాడులు..ఇవన్నీ జరిగినా సరే 175 గెలిచేస్తామనే కాన్ఫిడెస్న్ పెట్టుకోవచ్చా? అంటే ఏమో అది జగన్‌కు, ప్రజలకు మధ్య ఉండేది అని అనుకోవచ్చు.గతంలో కూడా పథకాల అమలు జరిగాయి..ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ వస్తున్నాయి. అయితే దీంతోనే 175 సీట్లు, 30 ఏళ్ళు సీఎం అనే ఫార్ములా వర్కౌట్ అవ్వడం అనేది..రాజకీయాల్లో జరగడం కష్టం. కాకపోతే ఇలా చెప్పడం ద్వారా…కనీసం అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు వస్తాయని భావిస్తున్నారో చెప్పలేం. మొత్తానికి జగన్ కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకోవాల్సిందే అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

 

Tags: Hardy Years CM Formula

Post Midle

Leave A Reply

Your email address will not be published.