తూర్పున హరి….పడమట రుషి

hari-in-the-east-west-on-the-russia

hari-in-the-east-west-on-the-russia

– ప్రజల సేవలో తరిస్తున్న పోలీసులు

Date:13/07/2018

వరదయ్యపాళ్యెం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో తూర్పుదిశలోని వరదయ్యపాళ్యెం ఎస్‌ఐ హరిప్రసాద్‌, పడమటి దిశలో మొలకలచెరువు సీఐ రుషికేశవ పేద ప్రజల సేవల్లో తరిస్తూ పేద ప్రజల ఆప్త బందువులుగా మన్ననలు పొందుతున్నారు. శుక్రవారం వరదయ్యపాళ్యెంలోని వడ్డీపాళ్యెంకు చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలుకు కొడుకులు, కుమార్తెలు ఉండి ఆనాధల బ్రతుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం, పెన్షన్‌తో జీవనం కొనసాగిస్తోంది. ఓవైపు ఆనారోగ్యం పీడిస్తుండగా మరో వైపు గాలివాన అవ్వ గుడిసెను కూల్చివేసి, నిరాశ్రయురాలుగా మార్చింది. దీనిని గమనించిన ఎస్‌ఐ హరిప్రసాద్‌ తక్షణమే స్పందించారు. అవ్వకు బట్టలు, ఆహారపదార్థాలతో పాటు తక్షణమే సిమెంటు ఇటుకలతో గదిని నిర్మించి, అవ్వకు నీడ కల్పించారు. ఈ సంఘటనతో ప్రజలు ఆయనను ప్రశంసిస్తున్నారు. అలాగే సీఐ రుషికేశవ గత నాలుగు రోజుల క్రితం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 522 మంది రక్తదానం చేయగా, రాష్ట్ర రికార్డు సాధించారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రుషికేశవ పుంగనూరు, పెద్దపంజాణి, మొలకలచెరువు ప్రాంతాలలో ప్రజల ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.

తూర్పున హరి….పడమట రుషిhttps://www.telugumuchatlu.com/hari-in-the-east-west-on-the-russia/

Tags; Hari in the east … west on the russia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *