గులాబీ గూటికి హరీష్ అనుచరుడు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తెరాసకు గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ క్రమంలోఈటల బీజేపీలో చేరుతారని దాదాపు ఖరారు అయ్యింది. అయితే ఆయన వెంట మరికొంతమంది నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ ఛైర్మన్, టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరడం ఖరారైంది.మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఈ నెల 14న ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెందిన పలువురు లీడర్లతో కలిసి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎల్లుండి ఢిల్లీలో బీజేపీలో చేరుతున్నట్లు అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

 

 

 

ఆర్టీసీలో అశ్వత్థామరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల పాత్ర, స్వరాష్ట్రంలో సమస్యల సాధన కోసం సమ్మెలో అశ్వత్థామరెడ్డి ఎలాంటి ఆరోపణలకు వెరవకుండా ఉద్యమాన్ని కొనసాగించడంతో ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది.అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరితే గ్రేటర్ ఆర్టీసీలోని కార్మిక వర్గం మద్దతు పలికే అవకాశం ఉందంటూ కాషాయదళం భావిస్తోంది. మరోవైపు ఆయన వనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం. అయితే అశ్వత్థామరెడ్డి టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి మంత్రి హరీష్రావుకు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. గతంలో ఆర్టీసీలో పలుమార్లు సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో హరీష్రావుతోనే మధ్యవర్తిత్వం చేయించారు. దీంతో ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడం హాట్ టాపిక్‌గా మారింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Harish is a follower of Rose Gooty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *