అవసరాలకే హరీష్ రావును దగ్గరకు తీసుకున్నారా!

Harish Rao got the needs!

Harish Rao got the needs!

 Date:06/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గాల్లో ఈ అంశంపై ప్రస్తుతం హాట్ హాట్ చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం హరీష్ రావు తన నియోజకవర్గానికి చెందిన పనుల కోసం సీఎం కెసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన ఈ అంశంపై కెటీఆర్ తో మాట్లాడుకోమని హరీష్ కు సూచించారని తెలిపాయి ఆ పార్టీ వర్గాలు . అప్పటివరకూ ఏ పని అయినా కెసీఆర్ తో ఓకే చేయించుకోవటమే హరీష్ కు అలవాటు.
అనూహ్యంగా తాను అడిగిన పనిపై కెటీఆర్ తో మాట్లాడుకోమని కెసీఆర్ సూచించటంతో హరీష్ నొచ్చుకుని..అటు నుంచే అటు వెళ్ళిపోయారు.
అక్కడ నుంచే కెసీఆర్, హరీష్ మధ్య గ్యాప్ బాగా పెరిగిందని చెబుతున్నారు. తర్వాత పలు అంశాల్లో హరీష్ ను దూరం పెట్టారు. టీఆర్ఎస్  సొంత మీడియాలో హరీష్ కు అసలు ఏ మాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశారు. కానీ ఈ మధ్యే గజ్వేల్ కు చెందిన కొంత మంది నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ లో చేరారు. ఇది టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసింది.హరీష్ తో సంబంధం లేకుండా పార్టీని వీడిన వారిని వెనక్కి తెఛ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో హరీష్ ను రంగంలోకి దింపారు. హరీష్ రంగంలోకి దిగిన వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు వెంటనే తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించారు. హరీష్ ను దూరం పెడితే  జరిగే నష్టం గ్రహించే కెటీఆర్ స్వయంగా హరీష్ తో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా సమావేశాలకు దూరం పెడుతున్న హరీష్ రావును ఇటీవల  అనూహ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ సమావేశానికి హరీష్ రావును ఆహ్వానించారు.
ఆ సమావేశంలోనే హరీష్ పై కెటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. హరీష్ కూడా కెటీఆర్ ను పొడిగిన విషయం తెలిసిందే. కేవలం తమ అవసరాలకే ప్రస్తుతానికి హరీష్ రావును దగ్గరకు తీసుకున్నారని..లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే టెన్షన్ లో కెసీఆర్, కెటీఆర్ ఉన్నారని  చెబుతున్నారు. టీఆర్ఎస్ లో  ప్రస్తుతానికి ఈ ఆదిపత్య పోరు సద్దుమణిగినట్లు ఉన్నా..తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.
Tags:Harish Rao got the needs!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed