హరీష్ రావుకే మా ఓటు కొచ్చగుట్టపల్లి తీర్మానం

Harish Rao is our vote vote

Harish Rao is our vote vote

Date:19/09/2018
సిద్దిపేట ముచ్చట్లు :
 రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావుకే ఓటు వేస్తామని చేసిన అనంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామమైన కొచ్చగుట్టపల్లి గ్రామం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ  పల్లె చిన్నది.  మనసు మాత్రం పెద్దదని ధన్యవాదాలు తెలిపారు. నాడు కోటి ఎకరాల మాగాణి కావడానికి మార్గం సుగమం చేసారు.
టీఆర్ఎస్ కు వంద సీట్లు రావడానికి నేడు నాంది పలికారు.  మిమ్మల్ని గుండెలో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు.  ప్రాజెక్టు కోసం మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది.  ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసా మీకు వస్తుంది.
2013 చట్టం కంటే మంచి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. చివరి వరకు సేవ చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.  మీరు పెట్టిన నమ్మకం నూటికి నూరు శాతం కాపాడుతాం.
కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు వల్ల  పైనున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. తెలంగాణ రాకుండా చివరి వరకు అడ్డుకున్న చంద్రబాబు తో కాంగ్రెస్ వాళ్ళు ఎలా పొత్తు పెట్టుకుంటారు.  కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కోతలు, ఆకలి చావులే మిగులుతాయి. మీ ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని వ్యాఖ్యానించారు.
Tags:Harish Rao is our vote vote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *