బాలిక వైద్యానికి మంత్రి హరీష్ రావు చేయూత

Harish Rao radical help for girl medicine

Harish Rao radical help for girl medicine

Date:22/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

చెవుడు, మూగ బాలిక వైద్యానికి చేయూతనందించారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు. ఆ బాలికకు మెరుగైన చికిత్స కు సీఎం సహాయ నిధి ద్వారా రూ.5 లక్షల ఎల్ ఓసి ని మంత్రి హరీష్ రావు నేడు వారికి అందచేశారు. మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకునే స్తోమతు లేదు ఆందోళన తో సతమతమవుతున్న మిమ్మల్ని హరీష్ అన్న ఆదుకున్నాడు అంటూ 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగాం. ప్రయివేటు ఆసుపత్రికి వెళితే రూ. 9 లక్షలు అవుతాయన్నారు. రేక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఏదో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. మా కూతురి కి చికిత్స చేయించి సమస్య పరిష్కారం చేయాలని 22వ కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ తో చెప్పాం అని రవీంద్ర ప్రసాద్ అన్నారు. ప్రవీణ్ మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు. మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించి హైదరాబాద్ కోటి లో గల ప్రభుత్వ చెవి ,ముక్కు , గొంతు ఆసుపత్రి లో మెరుగైన చికిత్స చేయించే విధంగా వైద్యులతో మాట్లాడారు. ప్రత్యేక వైద్యానికి 6లక్షల రూపాయలు అంచనా వేసి వైద్యులు మంత్రి కి వివరించారు. వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా రూ.5లక్షలఎల్ ఓసి ని మంజూరు చేసి లావణ్య తండ్రికి అప్పగించారు. ఆందోళన గా ఉన్న మా కుటుంబం లో కొత్త ఆశను హరీష్ అన్న కలిగించారని రవీంద్ర ప్రసాద్ తెలిపారు. మా అమ్మాయి వైద్యానికి ఆర్థిక సహాయం అందించిన హరిష్ అన్నకు మేం ఎల్లప్పుడూ ఋణపడి ఉంటామని ఆయన అన్నారు. తమ వార్డు చెందిన పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన హరిశ్ అన్నకు 22వ వార్డు కౌన్సిలర్ కెమ్మ సారం ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందండిలా…

 

Tags:Harish Rao radical help for girl medicine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *