హరో….. హరా నామస్మరణలతో మారుమ్రోగిన శివాలయం
–కన్నులపండువగా కృత్తిక కావళ్ళు చెల్లింపు
— ప్రత్యేకపూల అలంకారంలో సుబ్రమణ్యస్వామి
— శివాలయంకు తరలివ చ్చిన భక్తులు
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలకేంద్రంలోని బజారువీధిలో వెలసిన శ్రీ అభీష్టదమృత్యుంజయేశ్వరస్వామి ఆలయ ఆవరణం పరిసర ప్రాంతాలు హరోం…హరా అనే నినాదాలతో మారుమ్రోగింది.శనివారం ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీవల్లీదేవసేన సమేతశ్రీషణ్ముఖసుబ్రమణ్యస్వామివారిలను ప్రధానఅర్చకులు రాజశేఖరధీక్షితులు ,కుమారస్వామి, మహేష్ స్వామిల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రంగు రంగుపూలు, విధ్యుత్‌దీపాలతో ముస్తాబుచేశారు. స్వామివారికి అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలనుంచి కృత్తిక కావళ్లు చెల్లించి భక్తులు వెహోక్కులు చెల్లించారు. వెహోక్కులు గల భక్తులు పసుపు
రంగు దుస్తువులు ధరించి కుటుంభసమేతంగా కావళ్లతో ఆలయానికి చేరుకొనిభక్తి పారవశ్యంతో పూజలు చేసి వెహోక్కులు సమర్పించారు.మరికొందరు నోటిలో నాలుకపై అటునుంచి ఇటువైపు కు సూలాలు గుచ్చుకొని కావళ్ళతో స్వామివారికి వెహోక్కులు తీర్చారు.భక్తులకు ఆలయ అర్చకుల చే స్వామివారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రభుత్వజూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సేవలు అందించారు. అనంతరం బెల్లాల శ్రీనివాసుల కుటుంభీకుల ్య్యధ్వర్యంలో రాత్రి సుబ్రహ్మణ్యస్వామిను నెమలి వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.

Tags: Haro…..Shiva temple named after Hara
