రైతులకు కొబ్బరి దింపడం సవాల్

యలమంచిలి ముచ్చట్లు:


కొబ్బరి కాయలు పేరు చెబితే కోనసీమ గుర్తుకువస్తుంది. తెలుగు రాష్ట్రాలకు ఇక్కడినుంచే కొబ్బరి బొండాలు, కొబ్బరి కాయలు రవాణా అవుతుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలు కొబ్బరి రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. లంక గ్రామాల్లో గత నెలరోజులుగా వరదలు తగ్గుముఖం పట్టలేదు. కొబ్బరి చెట్లన్నీ వరదల్లో వుండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం లంక గ్రామాలలో వరుస వర్షాలు ఎడతెరిపి లేకపోవడంతో, కొబ్బరి చెట్లు ఎక్కి దింపుటకు అనుకూలత లేకుండా పోయింది. దీంతో దింపిన కొబ్బరి కాయల్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం తలకుమించిన భారంగా మారింది. రదలతో ఏర్పడిన ఇబ్బందులతో రైతులకు కొబ్బరి దింపడం సవాల్ గా మారింది. ఇటీవల వర్షాలు తగ్గాయి. కానీ రైతులకు మాత్రం ఉపశమనం లభించలేదు. గోదావరి నది భారీ వరదలతో ముంచెత్తడం వరద నీరు గత 20 రోజుల నుండి తగ్గకపోవడంతో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయల్ని చెట్లు ఎక్కి తీయించడం, వాటిని బయటకు రవాణా చేయడం కష్టంగా మారింది. ఏం చేసేది లేక కొబ్బరి రైతులు బోట్లను ఆశ్రయించి వ్యయ ప్రయాసలతో కూడిన కొబ్బరి దింపడం మొదలుపెట్టారు. ఇటీవల గత 15 రోజులు ఉండి మార్కెట్ కొంత ఆశాజనకం వుంది. కాపుకి వచ్చిన కొబ్బరికాయలు దింపకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది. అందుకే కొబ్బరి పంటను కాపాడుకోవాలని ,ఖర్చుతో కూడినా రైతులు కొబ్బరిని దింపుతున్నారు. వచ్చిన కాడికి సొమ్ము రాబట్టుకుంటున్నారు . కొబ్బరి దింపు కార్మికులకు ఒక బోటు, కొబ్బరి రవాణాకు వేరొక బోటును వినియోగిస్తూ కొబ్బరికాయల్ని గట్టుకు చేరుస్తున్నారు. వరదలో కొబ్బరి దింపడం చూసేవారికి చిత్రంగా అనిపిస్తే.. తడిసి మోపెడు అవుతున్న ఖర్చు రైతుని ఇబ్బంది పెడుతోంది. కొబ్బరి దింపుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

Tags: Harvesting coconuts is a challenge for farmers

Leave A Reply

Your email address will not be published.