నల్గొండలో హస్తం టీం రెఢీ

నల్గొండ ముచ్చట్లు:

 

తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం మూడు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే…ఎప్పుడూలేని విధంగా ఈ సారి తెలంగాణలో త్రిముఖ పోరు జరగనుంది…టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య వార్ జరగనుంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయంతో అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తుంది…అటు రెండు సార్లు వరుసగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్…మూడోసారైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది…ఇక తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.అయితే ఏదేమైనా మూడు పార్టీల మధ్య వార్ నడిచేలా ఉంది…కాకపోతే ఒకో జిల్లాలో ఒకో విధంగా ఫైట్ ఉండేలా ఉంది…కొన్ని చోట్ల టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య వార్ ఉంటే…మరికొన్ని చోట్ల టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ జరిగేలా ఉంది…అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య కూడా ఫైట్ నడిచేలా ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడవనుంది. మామూలుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటకానీ గత ఎన్నికల్లో నల్గొండలో కారు సవారీ నడిచింది…అయితే ఈ సారి మాత్రం కారుకు ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం పార్టీ చూస్తుంది…ఈ సారి ఎలాగైనా కారుని నిలువరించాలని అనుకుంటుంది. ఇక ప్రస్తుతం నల్గొండ రాజకీయాలని గమనిస్తే హస్తం పార్టీ బాగా పికప్ అయినట్లే కనిపిస్తోంది..పైగా ఎక్కడకక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..ఈ నేపథ్యంలో హస్తంకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది…ఇక్కడ బీజేపీకి అంతగా బలం లేదు…ఏదో ఒకటి, రెండు స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు.ఇక కారుకు చెక్ పెట్టడానికి హస్తం టీం రెడీ అయింది…ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు…హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అటు నాగార్జునసాగర్ లో జానారెడ్డి తనయుడు రఘువీర్, మిర్యాలగూడలో జానారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది.భువనగిరిలో కుంభం అనిల్, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, దేవరకొండలో కిషన్ నాయక్, సూర్యాపేటలో దామోదర్ రెడ్డి…ఇలా ఎక్కడకక్కడ కాంగ్రెస్ నాయకులు ఫిక్స్ అయిపోయారు…ఈ సారి నల్గొండలో హస్తం పార్టీ కారుని నిలువరించేలా ఉంది.

 

Tags: Hastam Team Reddy in Nalgonda

Post Midle
Post Midle
Natyam ad