Natyam ad

హస్తినలో చర్చలకు ఆంధ్రప్రదేశ్ లో రీసౌండ్

గుంటూరు ముచ్చట్లు:

 

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల ఢిల్లీ ప్రయాణాలపైనా ఎక్కువ చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లడం వల్ల అటు రాజకీయ వర్గాల్లోను , మీడియాలోను ఢిల్లీ టూర్ల పైన అత్యంత ఆసక్తి సంతరించుకుంది. పవన్ కళ్యాణ్, పొత్తుల విషయం కోసం ఢిల్లీ అధిష్టానంతో చర్చ జరిపితే చంద్రబాబు ఢిల్లీ పర్యాటన గురించి మాత్రం ఇప్పటివరకు ఇరు పార్టీ వర్గాలనుండి ఎటువంటి అధికార ప్రకటన రాకపోవడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఇదే విషయం పైన అటు టీడీపీ కానీ బీజేపీ కానీ నోరు మెదపకుండా ఉండడంపై చర్చ జరుగుతుంది.ఇదిలా ఉంటె ఇన్ని ఢిల్లీ పర్యాటనల్లో రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం జరిగింది అంటే అది కేవలం నిధులలో రావడం అని మాత్రం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీ కింద తొలుత 10,460 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటివరకు జగన్ ఢిల్లీ పర్యటనల గురించి రక రకాలుగా చర్చలు జరిగినప్పటికీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలనుండి మంచి ఆదరణ సంపాదించుకుంది ప్రభుత్వం. ఇంతలోనే పోలవరం పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టి కొత్త అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి స్పందించిన కేంద్ర తొలిదశ నిధులకింద 12,911 కోట్లను మంజూరు చేసింది. రెండు వారల వ్యవధిలోనే రెండు పెద్ద హామీలను సీ ఎం జగన్ తన ఖాతాలో వేసుకుని ప్రతిపక్షానికి ఎన్నికల సవాలు విసిరారు.

 

సంకల్పానికి నిదర్శనం

Post Midle

కేంద్రం ప్రభుత్వంతో సత్సంభంధాలు కలిగి ఉండడం వల్లే రాష్ట్రానికి నిధులు తీసుకు రాగలిగామని… నాలుగు సంవత్సరాల నుండి పట్టు వదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి ఉండడం తన దృఢ సంకల్పానికి నిదర్శనం అని మాజీ మంత్రి ప్రత్తిపాడు నియోజకవర్గం ఎం ఎల్ ఏ మేకతోటి సుచరిత అన్నారు. ఈరోజు తన నివాసంలో నుండి మాట్లాడుతూ దివంగత నేత వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ ను లక్ష ఎకరాలకు సాగు అందించేదిగా మళ్ళి కొడుకు అయిన జగన్ వల్లే సాధ్యం అన్నారు.

 

ముందస్తు లేదు

రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరంలో ముందస్తు ఎన్నికల గురించి జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదే విషయం పైన నిన్న జరిగిన కాబినెట్ సమీక్షలో సీఎం జగన్ 9 నెలలు కష్టపడండి అని పార్టీకి ఇచ్చిన పిలుపుతో ఒక్కసారి ఆ ఊహాగానాలకు చెక్ పడింది. ఇలాంటి తరుణంలో వైఎస్సార్ సీపీ అన్ని విధాలుగా ఎన్నికలకు సన్నద్ధమవుతోంది అన్న సంకేతాలను బలంగా పంపుతుంది.

 

Tags:Hastina talks reverberate in Andhra Pradesh

Post Midle