హ్యాట్రిక్ ప్లస్ 426 టార్గెట్

Date:13/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆటల్లోనే కాదు పాలిటిక్స్ లోను రికార్డ్ లు ఉంటాయి. ఆ రికార్డ్ లను చెరిపేసేందుకు అంతా తమవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తన అద్భుత బ్యాటింగ్ తో విపక్షాల బౌలింగ్ ను ఊచకోత కోసి మరోసారి అధికారం అందుకున్న మోడీ టార్గెట్ పాత రికార్డ్ బద్దలు కొట్టడమే అంటున్నాయి కాషాయ దళాలు. దేశ పార్లమెంట్ చరిత్రలో రాజీవ్ గాంధీ పేరిట ఒక అరుదైన రికార్డ్ నెలకొని ఉంది. ఇప్పటివరకు ఏ పార్టీ అందుకోలేనంత స్థాయిలో రాజీవ్ గాంధీ రికార్డ్ ఆ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్ట్టించారు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదంతో 2011 లో టీం ఇండియా ధోని సేన ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించి కప్ గెలుచుకుంది.

 

 

 

అదే రీతిలో ఇప్పుడు మోడీ సైతం ఫాం లో ఉండగానే పాత రికార్డ్ చెరిపేయాలని తహతహలాడుతున్నారంటున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సారథ్యంలని కాంగ్రెస్ పార్టీ 426 స్థానాలు గెలుచుకుని భారీ విజయంతో పాటు భారీ రికార్డ్ నెలకొల్పేసింది.ప్రస్తుతం మోడీ కి లోక్ సభలో 303 సభ్యుల బలం వుంది. ఈ సంఖ్యను మరింతగా వచ్చే ఎన్నికల్లో నెలకొల్పాలని మోడీ అమిత్ షా తో వ్యూహం రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ 426 ఫిగర్ ను అందుకోవడంతో బాటు హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని పొలిటికల్ టాక్.

 

 

 

 

 

ఇప్పుడున్నంత బలహీనంగా విపక్షాలు ఎప్పుడు లేవని వారు తేరుకునేలోగా పని పూర్తి చేయాలన్న కమలనాధుల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. అయతే రాజీవ్ గాంధీ హయాంలో ప్రాంతీయ పార్టీలుఅంత బలంగా లేవు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పట్టుతో ఉన్నాయి. మరి ఆ రికార్డును మోడీ అధిగమిస్తారా? లేదా?

దక్షిణాది రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడని కేంద్రం

Tags: Hat trick plus 426 target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *