దేశంలో ప్రాంతీయ పార్టీల హవా

   Date:15/03/2019
 నిజామాబాద్ ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చేసుకుంటే ప్రజలు ఈరోజుల్లో ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు. జాతీయ పార్టీలు రాష్ట్రాలను పట్టించుకొనే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. అందుకే 16 స్థానాలు గెలుపే లక్షయంగా పని చేయాలని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనెల  19న గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కేసీఆర్ సభ  కు సన్నాహక స మావేశం ఏర్పాటు చేసాం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు రావాలని కోరారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఐ ఏ ఎస్ అధికారుల కొరత ఉండే అప్పుడు పార్లమెంటు లో కోట్లాడి తెచ్చుకొన్నాం. రాష్ట్రంలో ఎయిమ్స్ కాలేజీ కోసం కోట్లాది నిధులు సాదించుకొన్నాం. జాతీయ పార్టీలు రాష్ట్రం కోసం చేసిన పనులంటూ ఏమి లేవని ఆమె అన్నారు. 16+1=17 స్టానాలను గెలిపించాలని పార్లమెంట్ లో అధిక నిధులు సాదించేందుకు అవకాశం ఉంటది.
రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశం లో  9 రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నారు.దేశంలో  మోడీ కూడా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కిసాన్ బందు అమలు చేస్తున్నారు. జాతీయ పార్టీలు మోసపూరిత మైన హామీలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు అధికారం లో ఉన్న  ఇంకా పేద ప్రజల కోసం అంటున్నారు.  ఇంకా దేశం లో పేదరికం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం విడ్డూరమని ఆమె అన్నారు.  దేశం లో అధికారం లో ఉన్న పార్టీ లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని అన్నారు. టిఆర్ ఎస్ పార్టీకి  నిండు మనసుతో ప్రజలందరి ఆశీర్వాదం ఉండాలి నిండు మనసుతో కారు గుర్తుకు ఓటేయాలి. 19 న కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.
Tags:Hawa of regional parties in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *