హవాలా రూపంలో డబ్బు చేరవేస్తూ అడ్డముగా దొరికిపోయారు.

Hawala has been found to be trapped in the form of money.

Hawala has been found to be trapped in the form of money.

Date:06/10/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

హవాలా రూపంలో సొమ్మును చేరవేస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. వారి నుంచి సుమారు 99  లక్షల 36 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటకు వచ్చింది.

 

గుజరాత్ కు చెందిన వీరిద్దరూ నెలకు 20 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నగదును చేరవేస్తున్నట్టు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ కేసును ఐటి డిపార్టుమెంటుకు అప్పగిస్తున్నట్టు హైదరాబాద్ సిపి అంజనీకుమార్ తెలిపారు. డబ్బులు ఎక్కడినుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇంతపెద్ద మొత్తంలో డబ్బు దొరకడం సంచలనం గా మారింది.

రైతన్నలకు రెండో విడత ఆర్ధిక చేయూత

Tags:Hawala has been found to be trapped in the form of money.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed