బీజేపీ తీరు దుర్యోద్యనుడి రాజ్య కాంక్ష లా ఉంది

– నిప్పులు చెరిగిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్

Date:15/07/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

బీజేపీ తీరు దుర్యోద్యనుడి రాజ్య కాంక్ష లా ఉందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జీ. నిరంజన్ తీవ్రస్తాయి లో విమర్శించారు.సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ గోవా, కర్ణాటక లో బీజేపీ దుర్యోదనుడిలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం లో సొంతంగా బలపడే శక్తి బీజేపీ కి లేదు. అందుకే కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సాహఇస్తున్నారని విమర్శించారు.బీజేపీ కూడా అపజయాల తర్వాతే గెలిచిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఒకటి రెండు అపజయలకు కాంగ్రెస్ కుంగి పోదన్నారు.

 

 

 

బీజేపీ నేత, మదేప్రదేశ్ మాజి సీఎం చౌహాన్..చేత కాకనే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాదనడం  శుద్ధ అబద్ధమన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకే రాహుల్ రాజీనామా చేసాడని,జవాబిదరితనం వహించే రాహుల్ రాజీనామా చేసారన్నారు.పదవులును పట్టుకుని వేలాడే తత్వం రాహులది కాదు.రాహుల్ పై బురద జళ్లేందుకే ఆరోపణలు. కాంగ్రెస్ నేతలను కించపరచటం బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్యఅని విమర్శించారు.ప్రధాని కూడా రాహుల్ను పప్పు అని కించ పరిచాన రాహుల్ జంకాలేదు.దేశ వ్యాప్తంగా పర్యటించి , రాజకీయాల్లో రాహుల్ సుస్థిర స్థానం సాదించుకున్నారు.గాలి విమర్శలు చేయడం మాజి సీఎం గా పని చేసిన చోహన్ కు తగదని నిరంజన్ హితవు పలికారు.

 

క్రీడలతో మానసిక ఉల్లాసం

Tags: he BJP is the quest for Duryodhana’s kingdom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *