Natyam ad

నడిరోడ్డు మీద నరికేసాడు

కాకినాడ ముచ్చట్లు:


కాకినాడలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద కానిస్టేబుల్ హత్య అనే  వార్త  లో పూర్తి నిజం లేదని కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణరెడ్డి అన్నారు. జరిగిన ఘటనపై అయన వివరణ ఇచ్చారు. శుక్రవారంఉదయం రోడ్డు పక్కన వ్యన్  పై కొబ్బరి బొండాలు అమ్ముతున్న  పెంటా వెంకట దుర్గాప్రసాద్ దగ్గరకు తన విధుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నారావు  అక్కడి వెళ్లారు. వ్యాన్ రికార్డులు,  వ్యాన్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలు గురించి అడిగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య  ఘర్షణ జరిగింది. ముందుగా  తిట్టుకున్నారు. ఆవేశానికి లోనైన  కొబ్బరి బొండాలు వ్యాపారి  కొబ్బరి బోండాల కత్తితో అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్ చిన్నారావును నరికాడు.  ఘటన  జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలయిన అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్  చిన్నారావును  కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించామని అయన అన్నారు.

 

Tags; He cut on the sidewalk

Post Midle
Post Midle