అయన అమిత్ షా కాదు…జూటా షా

He is not Amit Shah ... Zoota Shah

He is not Amit Shah ... Zoota Shah

Date:11/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాదు ఆయన పేరు జూటా షా. అమిత్ షా సభకు 10 వేల మంది కూడా హాజరు కాలేదు. మాది జూటా పార్టీ అని గడ్కరీయే ఒప్పుకున్నారని కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే , కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అరోపించారు.  గురువారం అయన మీడియాతో మాట్లాడారు. అయోధ్య లో రామమందిరం ఎందుకు కట్టలేదు అక్కడ రాష్ట్రంలో కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నా ఎందుకు నిర్మించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరలు తగ్గుతాయన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కన్పించకపోతే మా కంటివెలుగు పథకం ద్వారా పరీక్ష చేయించుకోవాలని అన్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి అమిత్ షా కు లేదని అన్నారు. కరీంనగర్ కరీంనగర్ బిజెపి నాయకుడు బండి సంజయ్ పై  గంగుల కమలాకర్ సంచలన వాఖ్యాలు చేసారు. సంజయ్ అనవసరపు విమర్శలు చేస్తున్నారు. సంజయ్  ని గుండు గీయించి గాడిద మీద ఉరేగిస్తామని హెచ్చరించారు. గుడి  హుండీ లో డబ్బులు వాడుకుంటున్నారు సంజయ్.  ఒక్కసారి నేను తలచుకుంటే నీ చిట్టా మొత్తం బయట పెట్టాల్సి వస్తుందని అయన అన్నారు.
Tags:He is not Amit Shah … Zoota Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *