Natyam ad

విమర్శలకు జడిసి అభివృద్ధిని ఆపే వాడిని కాదు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయొచ్చని నాలుగేళ్లలో చేసి చూపించాము.రాష్ట్రంలో మరెక్కడా లేని అభివృద్ధిని ప్రజల కళ్ళకు చూపించాము.ఈ యజ్ఞం ఇంతటితో ఆగదు.ఆధ్యాత్మిక, సాహిత్య, కళా మానవీయ విలువలు పెంపొందించేలా తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.మహతి ఆడిటోరియానికి తోడుగా ఈ రోజు నుండి కచ్ఛపీ ఆడిటోరియం కూడా తిరుపతి నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది.ఈ ఆడిటోరియం కూడా సంగీత,సాహిత్య, ఆధ్యాత్మిక ప్రియులను అలరించేలా కార్యక్రమాలు జరగాలి.గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతి నలుదిక్కులను అనుసంధానం చేశాము.చేసిన అభివృద్ధిని కార్పొరేటర్లు , డిప్యూటీ మేయర్లు, మేయర్ తోపాటు అందరూ కూడా జనం చెంతకు తీసుకుని పోవాలి.తిరుపతి నగరంలో ఆదివారం కచ్ఛపీ కళాక్షేత్రం ప్రారంభ సభలో టీటీడీ చైర్మన్, శాసన సభ్యులు  భూమన కరుణాకర రెడ్డి.

 

Tags: He is not one to stop development because of criticism

Post Midle
Post Midle