తను శ్రీ ఒక్కసారి ఆలో్చించు : ఆర్జీవీ

He is the one to think: RJ

He is the one to think: RJ

Date:10/10/2018
ముంబై ముచ్చట్లు:
హార్న్ ఒకే ప్లీజ్..’ సెట్లో నానా పాటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేదించాడని నటి తనుశ్రీ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనుశ్రీకి బాలీవుడ్ నటీమణుల నుంచి మద్దతు లభిస్తోంది. కొందరు ఆమె అడుగుజాడల్లో నడుస్తూ తమ అనుభవాలను #MeToo ద్వారా పంచుకుంటున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం.. నానా పాటేకర్‌కు మద్దతుగా నిలిచారు. నానా అలాంటివారంటే నమ్మబుద్ధి కావడం లేదని ఆయన గురించి చెప్పుకొచ్చారు. ‘‘సినీ పరిశ్రమలో లైంగిక వేదింపులు జరుగుతున్న మాట నిజమే. వాటి గురించి నిత్యం వింటున్నాం. ఇలాంటి విషయాలను తనుశ్రీ దత్త అయినా, ఇంకెవరైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం అభినందనీయమే’’ అని తెలిపారు.
ఆయన ఎవరికీ హాని చేయడు: ‘‘నాకు తెలిసిన నానా పాటేకర్ ఎలాంటివాడో మీకు చెప్పాలని అనుకుంటున్నా. నేను తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదటిసారి బాంబేలో అడుగుపెట్టిన తర్వాత ఎంతో కష్టపడి ఆయన ఫోన్ నెంబరు సంపాదించా. ఫోన్ చేసిన వెంటనే ఆయన ‘హలో’కు బదులు ‘ఆ చెప్పు’ అన్నారు. నా పేరు రామ్ గోపాల్ వర్మ నేను సౌత్ ఇండియా సినీ దర్శకుడిని, మిమ్మల్ని కలవాలి అని చెప్పగానే రమ్మని పిలిచారు’’ అని ఆర్జీవీ తెలిపారు. మా అమ్మకు ఫోన్ చేసి మరీ తిట్టారు: ఇంటికి వెళ్లిన తర్వాత ఆయనకు నేను కథ చెప్పడం మొదలుపెట్టా. కథ వింటూ మధ్యలో చాయ్ తాగుతావా? నానా అని అడిగారు. తాగుతా అని చెప్పగానే.. అదిగో కిచెన్ అక్కడ ఉంది.
నాకు కూడా ఓ చాయ్ చేసుకుని రా అని చెప్పారు. అయితే, నాకు చాయ్ చేయడం రాదని చెప్పా. గు** కిందకు అన్నేళ్లు వచ్చాయి.. చాయ్ చేయడం కూడా రాదా? అని తిట్టారు. ఆ తర్వాత మీ అమ్మకు ఫోన్ కలుపు అని ఆమెతో మాట్లాడారు. మీ వాడికి చాయ్ చేయడం నేర్పలేదా అని అడిగారు’’ అన్ని అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకున్నారు ఆర్జీవీ. తన జీవితంలో చూసిన గొప్ప మానవతావాది నానా పాటేకర్ అని, ఆయన అద్భుతమైన నటుడు అని ఆర్జీవీని కొనియాడారు. పని విషయంలో ఆయన చాలా శ్రద్ధకనపరుస్తారని, తనలా ఎవరైనా శ్రద్ధ పెట్టకపోతే కొట్టడానికి కూడా వెళ్తారని ఆర్జీవీ తెలిపారు.
అతడికి వచ్చే పారితోషికం రూ.4 కోట్లయితే.. రూ.2 కోట్లు తనకు, మరో రూ.2 కోట్లు చారిటీ సంస్థలకు ఇవ్వాలని చెప్పే ఆయన ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. ‘తనుశ్రీ దత్తా – నానా పాటేకర్ విషయంలో ఏ జరిగిందో నాకు తెలియదు.ఆరోజు ఆమె కారుపై దాడి గురించి కూడా తెలీదు. కానీ, తనుశ్రీ మరోసారి ఆలోచించు. నీగురించి తెలుసు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. ఏదైనా అపార్థం చేసుకుని ఉండొచ్చు. నానా అలాంటి వ్యక్తి కాదు’’ అని ఆర్జీవీ తెలిపారు.
Tags:He is the one to think: RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *