భార్యను చంపి ఫోటోలు బంధువులకు పంపాడు

ఉత్తరప్రదేశ్‌ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి గొంతు నొక్కి భార్యను హత్య చేశాడు. చనిపోయిన భార్య ఫొటోలను బంధువులకు పంపాడు. ఆ తర్వాత అతడు ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకర్ విహార్ కాలనీలో ఉంటున్న 30 ఏళ్ల శ్యామ్ గోస్వామి, 28 ఏళ్ల తన భార్యను శుక్రవారం చంపాడు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యపై అనుమానంతో శ్యామ్‌ ఆమెను చంపి సూసైడ్‌ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

 

Tags: He killed his wife and sent the photos to his relatives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *