ముంపు బాధితులకు కూరగాయలు పంపిణీ చేసిన చింతమనేని

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు జిల్లా పోలవరంలోని వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గోన్నారు. హనుమాన్ జంక్షన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయల కొనుగోలు చేశారు. వేలేరుపాడు మండలంలోని వరద ముంపు గ్రామాల్లో భాదితులకు సత్వరమే అందేలా చర్యలు తీసుకున్నారు.   మంగళవారం ఉదయం వేలేరుపాడు మండలంలోని 1600 వరదబాధిత కుటుంబాలకు పాల ప్యాకేట్స్, పంపిణీ చేసేందుకు వచ్చారు. బుధవారం మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకేట్స్ పంచేలా ఏర్పాట్లు చేసారు. ఈసందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.అధికారంలో ఉన్నా ,లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.

 

Tags: He regretted distributing vegetables to the flood victims

Leave A Reply

Your email address will not be published.