Natyam ad

మొన్న చూశాడు నిన్న అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రాత్రికి రాత్రి అద్భుతం చేశాడు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్థానిక ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కూడలిలోని మలుపు వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు, యాక్సిడెంట్లు జరుగుతున్న విషయాన్ని గుర్తించారు.నగర వాసులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షిత ప్రయాణం చేయాలన్న ఆలోచనతో అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేశారు.ఇదంతా కూడా మొన్న చూడడం, నిన్న ఉదయం అనుకోవడం, మరసటి రోజు రాత్రికి రాత్రి అద్భుతమైన ఫ్రీ లెఫ్ట్ వేయించడం అన్నీ ఆఘమేఘలపై జరిగిపోయాయి. ఈ ఫ్రీ లెఫ్ట్ వేయడం వల్ల ట్రాఫిక్ ఇక్కట్లు, యాక్సిడెంట్లు ఉండవంటున్నారు స్థానికులు.మరికొందరేమో నిన్న సాయంత్రం వరకు అసలు రోడ్డు వేస్తున్నారా అన్న ఊహ కూడా లేదు, అయితే ఉదయం లేచి చూసే సరికి రోడ్డు ఉండేసరికి ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు. మరికొందరు తిరుపతిలో భూమన అభినయ్ చాలా గొప్ప పనులు చేస్తున్నారు అని కొనియాడారు.

Post Midle

Tags; He saw it yesterday, he thought it yesterday, and the next morning he performed a miracle at night.

Post Midle