డ్యాన్స్ ఆపిందని కాల్చేశాడు

He shot the dance

He shot the dance

Date:07/12/2019

లక్నో ముచ్చట్లు:

మద్యం మత్తు, అధికార మదం, చట్టాలు ఏమీ చేయలేవనే ధీమా మనుషులను ఎంతటికైనా తెగించేలా చేస్తోంది. ఫలితంగా మానత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఇటీవల దిశ ఘటన దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసినా.. ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిల్‌పై తిరుగుతున్న ఉన్నవ్ రేప్ ఘటన నిందితులు.. బాధితురాలికి నిప్పు పెట్టి చంపేశారంటే దేశంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.డిసెంబరు 1న ఉత్తరప్రదేశ్‌లోని టిక్రా గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరిగింది. భరత్‌లో భాగంగా కొంతమంది యువతులతో నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మ్యూజిక్ ఆగడంతో ఇద్దరు యువతులు డ్యాన్స్ చేయడం ఆపేశారు. దీంతో ఓ వ్యక్తి డ్యాన్స్ చేయాలని లేకపోతే షూట్ చేస్తామని వారిని బెదిరించాడు. వారు అతడి మాటలు పట్టించుకోకపోవడంతో హీనా అనే డ్యాన్సర్‌ను షూట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఓ వ్యక్తి గన్ పట్టుకుని ‘‘షూట్ చేసేస్తా’’ అని హెచ్చరించాడు. అతడి పక్కనున్న వ్యక్తి ‘‘సుధీర్ భయ్యా.. మీరు గన్‌తో కాల్చేయండి’’ అని అన్నాడు. దీంతో అతడు హీనా ముఖానికి గురిపెట్టి షూట్ చేశాడు. బుల్లెట్ ఆమె దవడ నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పెళ్లికి హాజరైన గ్రామ పెద్ద కుటుంబ సభ్యుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు వీరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

 

నాటు సారా తయారీ బట్టీలపై మెరుపు దాడి

 

Tags:He shot the dance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *