Natyam ad

అక్రమ సంబంధానికి అద్దొస్తున్నాడనే హత్య

-టిడిపి నేత రాజారెడ్డిని చంపించింది కన్న కూతురే..
-ప్రియుడుతో కలసి గడ్డపారతో హత్య చేయించిన కసాయి

-జిల్లాలో సంచలనం రేకెత్తించిన టిడిపి నేత రాజారెడ్డి హత్య కేసును చేదించిన సీఐ, ఎస్ఐలు

-హత్య కేసులో నిందితులను అరెస్టు చూపించిన ట్రైని డిఎస్పీ ప్రశాంత్

 

Post Midle

ములకలచెరువు ముచ్చట్లు:


జిల్లాలో సంచలనం రేకెత్తించిన టిడిపి నేత బురకాయలకోట గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు రాజా రెడ్డిని హత్య చేయించింది అతని గారాల పట్టి అయిన కసాయి కూతురేనని పోలీసులు తేల్చేశారు. హత్య కేసులో నిందితులను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి ట్రైనీ డిఎస్పి ప్రశాంత్, సీఐ మధు, ఎస్సై తిప్పేస్వామి కథనం మేరకు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మొలకలచెరువు మండలం, బురకాయలకోట పంచాయతీ, తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ సీనియర్ నేత బురకాయలకోట టీడీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజా రెడ్డిని వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం పాఠ కులకు విధితమే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేపట్టి, పక్కాగా అందిన టెక్నికల్ ఆధారాలతో నిందితు లను ఎట్టికేలకు గుర్తించారు.

 

 

రాజారెడ్డిని హత్య చేసింది కుటుంబ సభ్యులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుగా ఉన్నాడని, ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతో కన్న కూతురు బ్రాహ్మణి తన ప్రియుడి అరుణ్ కుమార్ తో కలిసి అర్థరాత్రి నిద్రపోతున్న తండ్రిని గడ్డపారతో తలపై మోదీ దారుణంగా హత్య చేయించినట్లు పట్టుబడిన నిందితులు నేరం అంగీకరించడం జరిగిందన్నారు. కాగా హత్యకు ఉపయోగించిన గడ్డపారను నిందితుడు రైల్వే స్టేషన్ దగ్గర బైక్ను పార్కు చేసిన ముళ్లపదల్లో దాసిపెట్టడంతో ఆధీనం చేసుకుని, బ్రాహ్మణి వద్ద సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. టీడీపీ నేత రాజా రెడ్డిని హత్య చేసింది కన్న కూతురు బ్రాహ్మిని, పక్క గ్రామానికి చెందిన ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ గా నిర్ధారించి అరెస్టు చేయడంతో ఉత్కంఠతకు తెరపడిందన్నారు.

 

Tags: He was killed because he was having an illicit relationship

Post Midle