చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ.. రైలు ఢీకొని దుర్మరణం

Date:28/09/2020

రంగారెడ్డి   ముచ్చట్లు

చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ .. రైలును ఢీకొని వ్యక్తి  దుర్మరణం పాలైయ్యాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.  రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో రైల్వే ట్రాక్ పై ఈ సంఘటన చోటు చేసుకుంది. రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ డబల్ లైన్ రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతూన్నాడు. పాత రైల్వే ట్రాక్ పై రైలు వస్తుందనే భావనతో కొత్త రైల్వే ట్రాక్ పై నిలుచుని ఫోన్ మాట్లాడుతున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో రైలు వచ్చే శబ్దం వినిపించలేదు.  దీంతో రైలు వచ్చి బలంగా రాంసింగ్ ను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే రాంసింగ్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 అన్నగారి బాటలో అల్లుడు

Tags:He was talking while wearing headphones in his ear .. He was killed in a train collision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *