Natyam ad

దేవుడి కాళ్ళవద్ద మనిషి తల

-తల.. మెండం వేరు చేసిన హంతకులు
 
నల్గొండ  ముచ్చట్లు:
 
 
ఓ మనిషిని హత్య చేశారు.. తలను దేవత విగ్రహం కాళ్ళవద్ద పెట్టారు.. మొండం మాత్రం కనిపించకుండా చేశారు.ఎవరు చేశారో ఈ పని తెలియదు కానీ నల్గొండ జిల్లాలో కలకలం రేపింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో దారుణం జరిగింది.హైదరాబాద్ నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తలను అక్కడ పెట్టారు.వ్యక్తిని చంపి తలను వదిలి పెట్టి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు, మొండం మాత్రం కనిపించలేదు.అయితే క్షుద్రపోజలు జరుగుతున్న క్రమంలో ఈ హత్య జరిగిందా..? లేదంటే ఎక్కడైనా చంపి ఇక్కడ తలను మాత్రమే పెట్టి వదిలేసి వెళ్నిపోయారా అని విషయం తెలియడం లేదు.స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Head .. murderers who separated the mandible