Natyam ad

వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ తో ప్రజలకు ఆరోగ్య భరోసా…

రామాపురం ముచ్చట్లు:

నీలకంఠరావుపేటలో విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి .పల్లెల చెంతకే వైద్యాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారంరామాపురం మండలం నీలకంఠరావుపేట లో విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ తో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్గిందన్నారు.ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో12 రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.65 రకాల మందులతో పాటు67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటివద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Post Midle

Tags: Health assurance to people with YSR Village Clinics…

Post Midle