రామగుండం ప్రజలకు ఆరోగ్య ప్రధాత ఎమ్మెల్యే కోరుకంటి చందర్

పెద్దపల్లి ముచ్చట్లు:

రామగుండం నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య ప్రధాత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని రామగుండం పట్టణ అధ్యక్షుడు బోడ్ధుపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్  కన్నూరి సతీష్ కుమార్, అల్ల గణేష్   అన్నారు. రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు కావడంతో టి.ఆర్.ఎస్ నాయకులు బుధవారం రామగుండం పట్టణం మాజీద్ కార్నర్లో సి.ఎం. కేసీఆర్‌, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రామగుండం ప్రజల ఆకాంక్ష ‍అయున మెడికల్ కళాశాల రామగుండానికి మాంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. రామగుండం ప్రజల సేవ కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు  తమ జీవితం త్యాగం చేశారన్నారు.
టీఆర్ఎస్ పార్టీ  రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కన్నూరు సతీశ్ కుమార్, ఫాతిమా సలీంబేగ్ సమన్వయ కమిటి సభ్యులు బుగ్గ రాములుగౌడ్, డాక్టర్ ముస్తాఫా  పట్టణ నాయకులు దుర్గం రాజు, మాడిశెట్టి రవీందర్, శిరంశెట్టి శ్రీనివాస్, ఉప్పరి లక్ష్మణ్, అల్లి గణేష్, ఎండీ అత్తార్హుస్సేన్, చింతకింది తిమోతి, గూడూరి   వెంకన్న, కొల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Health chief MLA Korukanti Chander for the people of Ramagundam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *