Natyam ad

వైద్యం మరింత చేరువ-జిల్లాలో బస్తి దవాఖానలు ఏర్పాటు

-అచ్చంపేట నాగర్ కర్నూల్ పట్టణాలకు మంజూరు
-నాగర్ కర్నూల్ కు అర్బన్ పిహెచ్సి సైతం..
-.ప్రజలకు తీరనున్న వైద్యం ఇక్కట్లు

నాగర్ కర్నూల్ ముచ్చట్లు :

Post Midle

మునిసిపాలిటీలోని బస్తీ ప్రజలకు వైద్యం వరింత చేరువ కాన్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ  దవాఖానలు ఏర్పాటు చేసిఆరోగ్య భరోసా కల్పిస్తుంది. తాజాగా జిల్లాకు మరో రెండు బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు అచ్చంపేటకు బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. అలాగే కల్వకుర్తి కొల్లాపూర్ లో సైతం ఏర్పాటు చేసి పట్టణ వాసులకు వైద్య సేవలు అందించే ఆలోచన చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మరో బస్తి దవాఖాన కు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఒక యుపిహెచ్సి మంజూరు

జిల్లాలో ఇప్పటికే జిల్లా ఆసుపత్రి మెడికల్ కళాశాలతో పాటు 4 సిహెచ్సిలు
27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నాగర్కర్నూల్ అర్బన్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఆలోచనలో ఉన్నప్పటికీ కోవిడి నేపథ్యంలో జాప్యం జరిగింది. తర్వాత బస్తీ  దవాఖానలు ప్రతిపాదనలు మంజూరు రావడంతో గతంలో ప్రతిపాదించిన ఒక యూపీహెచ్సీ తో పాటు అచ్చంపేట నాగర్ కర్నూల్ ప్రభుత్వం ఒక్కొక్క బస్తి దవాఖానలు మంజూరు చేసింది. సీజనల్ వ్యాధిలో ప్రబలే బస్తీలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు పెరుగైన వైద్యం అదుపుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

ప్రభుత్వము హైదరాబాదులో బస్తి దవాఖానలు ఏర్పాటు చేసి ప్రయోగాత్మ గంగా నిర్వహిస్తుంది. ఇందులో ఒక వైద్యాధికారి స్టాఫ్ నర్స్ సహాయకులు విధులు నిర్వహిస్తారు. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఓపి నిర్వహిస్తారు.  ప్రాథమిక వైద్యానికి సంబంధించిన ఔషధాలు బస్తీ దవాఖానలు అందుబాటులో ఉంటాయి.

పనితీరు ఇలా
రక్త నమూనాలు సేకరించి డయాగ్స్టిక్ సెంటర్ కు తరలించిన వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అవసరమైన చికిత్సకు రెఫర్ చేస్తారు. లేదంటే వైద్య నిపుణులకు సహప్రదించాలని సూచిస్తారు. ఇదిలా ఉండగా మునిసిపాలిటీలో యు పి పీహెచ్సీలకు బస్తి దవాఖానలు తోడైతే
ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు బహుళ ప్రయోజనాలు ఉంటాయని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. నిరుపేదలు పెద్ద ఆసుపత్రులకు వెళ్ళలేక వ్యాధి ముదిరే వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. బస్తీ
దవాఖానలు ఏర్పాటు అయితే వారికి మెరుగైన వైద్యం సేవలు అందుబాటులోకి వస్తాయి. పెద్ద ఆసుపత్రిలో ఓపి సేవలపై భారం తగ్గుతుంది.

పట్టణ ప్రజలకు ఊరట

బస్తి దవాఖానలు ఏర్పాటు ఆ విషయం తెరపైకి తీసుకురావడంతో జిల్లాలోని అచ్చంపేట నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో నివాస ఉంటున్న వేద మధ్యతరగతి ప్రజలు ఎదురుచూపులకు ఊరట లభించింది. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో  పాత ఆర్డిఓ కార్యాలయం చౌటపల్లి రోడ్డులో, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశి ఇటిక్యాల లో బస్తి దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ సిహెచ్సి నాగర్ కర్నూల్ పట్టణంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

త్వరలో అందుబాటులోకి: సుధాకర్ లాల్ .జిల్లా వైద్యాధికారి

అచ్చంపేట నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలకు ఒక్క బస్తీ దవాఖానలు మంజూరు అయ్యిద్ది. నాగర్ కర్నూల్ కు అర్బన్ సిహెచ్సికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సివిల్ వర్క్ చేపట్టారు. త్వరలోనే పేద ప్రజలకు బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తాయి.

 

Tags: Health is more accessible-establishment of Basti Davakhanas in the district

Post Midle