ఆరోగ్య ప్రదాత సీఎం జగన్ – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య ప్రదాతగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రజల మనన్నలు పొందుతున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి నేను ఒక బిడ్డగా ఉంటానని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోన వ్యాక్సిన్లు వేసి కరోన మహమ్మరిని నిర్ములించారని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. అదే క్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ప్రతినిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించి కరోన వల్ల ఎవరు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మందికి వ్యాక్సిన్లు వేయాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారన్నారు. అనంతరం 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు, 45 సంవత్సరాలు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ రాధాకృష్ణ, ఏఎన్ఏం సుగుణమ్మ, మండల వైకాపా కన్వీనర్ భాస్కర్ గౌడ్, డిజిటల్ అసిస్టెంట్ భారతమ్మ, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, మహిళా పోలీస్ గౌతమి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, సీఆర్. ఆనందరెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎన్.వెంకటరమణ, వాలింటర్లు దినకర్, రామచంద్ర, ప్రదీప్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Health provider CM Pics
– Sarpanch Srinivasureddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *