Natyam ad

పుంగనూరు లో ఆర్టీసి కార్మికుల ఆరోగ్యానికి భద్రత

పుంగనూరు ముచ్చట్లు:

ఆర్టీసి కార్మికులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ స్యుధాకరయ్య తెలిపారు. ఆదివారం ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ప్రభుత్వాసుపత్రి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌లు కలసి వైద్యులు డిపోలో శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఇలాంటి శిబిరాలను ఎప్పటికప్పుడు నిర్వహించి, సిబ్బంది ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కరీముల్లా, గౌరిశంకర్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Health safety of RTC workers in Punganur

Post Midle