ఆరోగ్య శ్రీ పథకం సూపర్

Date:19/11/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. అనంతరం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి పలు అంశాలపై వినతులు ఇచ్చాం. రాష్ర్టానికి రెండు లేదా మూడు మెడికల్ కళాశాలలు మంజూరు చేయాలని కోరాం. కొత్త వైద్య కళాశాలల మంజూరుకు కేంద్ర మంత్రి సుముఖత తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు క్యాన్సర్ రీజినల్ కేంద్రాలు కోరాం.ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లు ఇవ్వాలని కోరాం. రహదారుల వెంట ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కన్నా మెరుగ్గా ఉందని చెప్పాం. ఆరోగ్య పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉందని తెలిపారు.

కొనసాగుతున్న ఎర్ర చందనం వేట

Tags: Health Sree Scheme Super

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *