ఆరోగ్య శ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం

కాకినాడ ముచ్చట్లు:

 

ఆరోగ్య శ్రీ జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశం నందు కాకినాడ పట్టణం లోని సాయిసుధ హాస్పిటల్ పైన వచ్చిన ఓబిలిశెట్టి హరిబాబు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విదారణ జరిగినది దానిలో ఉభయులును కమిటీ చైర్మన్   చేకూరి కీర్తి  ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు విదారణ చేసి రోగి ఓబిలిశెట్టి సత్యనారాయణ విషయంలో హాస్పిటల్ వారు రూ . 10,84,000 / – అధికంగా వసూలు చేసినట్టు నిర్ధారణకు రావటం జరిగినది . కావున కమిటీ వారు రోగి తండ్రి పేరు మీద అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వాలని మరియు 7 రెట్లు అనగా రూ 75,88,000 / – ను జరిమానా విధించటమైనది . జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడు తండ్రి  ఓబిలిశెట్టి హరిబాబు చెక్కు ద్వారా రూ . 10,84,000 / – అందచేయటం జరిగినది ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్యాధికారి డా . ప్రసన్న కుమార్ , DCHS డా. రమేష్ కిషోర్, జిల్లా కోఆర్డినేటర్,ఆరోగ్యశ్రీ డా.పి . శ్రీనివాస్ , జిల్లా మేనేజర్ , ఆరోగ్యశ్రీ కే . నవీన్ పాల్గొన్నారు.

 

పుంగనూరు కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో లాక్‌డౌన్‌ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Health Sri District Disciplinary Committee Meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *