పచ్చదనం తో ఆరోగ్యం

సంగారెడ్డిముచ్చట్లు:

పల్లెలు పచ్చధనంతో విరాజిల్లినపుడే  ప్రజలు  పరిపూర్ణమైన ఆరోగ్యంతో  శోబిల్లతారని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ వి. భూపాల్ రెడ్డి అన్నారు.  సంగారెడ్డి జిల్లా   అమీన్ పూర్ మండలం  పటేల్ గూడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా  హరితా హరం కార్యక్రమాన్ని  నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి  హజరైన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్  వి.  భూపాల్ రెడ్డి, మెదక్  ఎంపీ  కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి లు స్ధానిక నేతలతో కలిసి   మొక్కలు  నాటారు.  అనంతరం  స్ధానికంగా సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్న  డబుల్ బెడ్ రూం లను వారు  పరిశీలించారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ కాలుష్య కారక పరిశ్రమలకు కొలువైన పటాన్ చెరులో  కాలుష్య నియంత్రణకు  ప్రతి ఒక్కరూ  మొక్కలు  నాటాలని సూచించారు. పచ్చదనం ఫరిడవిల్లిపుడే  సమాజం ఆరోగ్యం గా  ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో అధికారులు,  స్ధానిక నాయకులు  పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Health with greenery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *