Natyam ad

పుంగనూరులో జోనల్‌ క్రీడలతో ఆరోగ్యం

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు చిన్నతనం నుంచి క్రీడల్లో పాల్గొనడంతో ఆరోగ్యవంతులై , భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని డీవైఈవో కృష్ణప్ప కోరారు. సోమవారం స్థానిక శుభారాం డిగ్రీ కళాశాలలో నియోజకవర్గస్థాయి అండర్‌ -14, అండర్‌ -17 లకు చెందిన అథ్లెటిక్‌ క్రీడలను ఆయన , మాజీ క్రీడాకారులు సుకుమార్‌, నానబాలగణేష్‌, భరత్‌భూషణ్‌తో కలసి క్రీడా జ్యోతిని పట్టుకుని పరుగెత్తి ప్రారంభించారు. కృష్ణప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యార్థులచే జిల్లా టీములు ఎంపిక చేశామన్నారు. పరుగుపందెం, బాస్కెట్‌బాల్‌, త్రోబాల్‌, హైజెంప్‌, లాంగ్‌జెంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచి అన్ని రకాల క్రీడల్లోను ప్రావీన్యులుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఈటిలు, మాజీ క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Health with Zonal Sports in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.