యోగ”తో ఆరోగ్య యోగం

జిల్లాలో  ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
“మానవత్వం కోసం యోగా` అనే థీమ్‌”  తో 2022 యోగా వేడుకలు
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్

కడప ముచ్చట్లు:

తమ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యం యోగం పొందాలని నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఎన్. టి.ఆర్ సర్కిల్   ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో నగర పాలక సంస్థ,ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో  ఉదయం  6.30 గంటల నుండి 8 గంటల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా  నగర కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ…8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.  శారీరక వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభించిందన్నారు. తాను ఐఏఎస్ శిక్షణా సమయంలో ప్రతిరోజు తెల్లవారు జామున విధిగా వ్యాయామం, యోగా ద్యానం చేసేవారమన్నారు. దీనివల్ల క్రమశిక్షణ,  మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. శారీరక వ్యాయామం కొరవడితే.. మనిషిలో నెగిటీవ్ థాట్స్ వచ్చే అవకాశాలు అధికం అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ… ప్రతిరోజు వ్యాయామం, యోగా అలవరుచుకుని పాసిటివ్ ఆలోచనలతో. రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.మానవాళికి భారతదేశం అందించిన అపూర్వ కానుక మానసిక, శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా అన్నారు. నిత్య జీవితంలో యోగాను ఒక దినచర్యగా చేసుకోవాలన్నారు.

 

 

 

Post Midle

ఉరుకులు, పరుగుల జీవనంలో సరైన వ్యాయామం లేకపోతే  ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. చదువులు, ఇళ్లల్లో పనుల వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురువుతున్న నేపథ్యంలో  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా, ధ్యానం కోసం కేటాయించాలన్నారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రజలు వీటిపై మరింత ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటన్నారు. వేదకాలం నుంచి ఆదికాలం వరకు సనాతన భారత సంప్రదాయంలోనే యోగా సాధన ఇమిడి ఉందన్నారు. పూర్వీకులు శారీరక, మానసికో ల్లాసానికి యోగా ఆచరించార న్నారు. ప్రాచీనకాలంలో ఎందరో మునులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయన్నారు. మానసిక సమస్యలకు , శారీరక రుగ్మతలకు యోగ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ప్రతీఒక్కరూ మంచి ఆరోగ్య సూత్రాలు పాటించి.. మంచి ఆరోగ్య భవిష్యత్తును అందించాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్  మున్సిపల్ కమిషనర్ చరణ్ తేజ్, మున్సిపల్ కార్పోరేషన్ డీసీబీ శైలజ, స్టెప్ సీఈఓ బ్రహ్మయ్య, ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ బాబు, మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 

Tags: Health Yoga with “Yoga”

Post Midle
Natyam ad