యోగాతోనే ఆరోగ్యమయ జీవితం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

యోగ చేయడంవల్ల ఏకాగ్రత,శారీరక దృఢత్వము, మానసిక ఉల్లసము, ఆరోగ్యముగా ఉండడం…మొదలైన ఉపయోగాలు వున్నాయని శ్రీ  శుకబ్రహ్మాశ్రమం పీఠాధిపతులు పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు. చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ  శుకబ్రహ్మాశ్రమం ఆవరణలో ఉచిత యోగ శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి, పూజ్యశ్రీ శ్రీ సర్వాత్మనంద స్వామి, యోగ అధ్యాపకులు మార్కండేయులు, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, మాజీ  ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో విద్యార్థులతో యోగప్రక్రియలు, ప్రణాయామం,  ఓంకార నామాలు, భగవత్గీత లోని పద్యాలూ,వ్యాసాలు ఉచ్చరించటం, తదితర ప్రక్రియలు సాధన చేసారు.స్వామీజీ మాట్లాడుతూ  పూజ్యశ్రీ విద్య ప్రకాశనందగిరి స్వామివారి ఆశీర్వాదంతో ఈ  ఉచిత యోగ శిక్షణ పట్టణంలోని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యోగ ప్రక్రియవల్ల మనసు సుద్దిపడుతుంది, దానివల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది, వ్యాధులు దరిదాపుల్లోకి రావు అన్నారు. అలాగే యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన రూపం. యోగ అనేది సంస్కృత పదం, సాహిత్యపరంగా “చేరుటకు, ఏకం చేయటానికి లేదా జోడించుటకు” అని అర్థం. శరీరం మరియు మనసును ఏకం చేయటానికి యోగ సహాయపడుతుంది. మీ మనసు శుభ్రపరచి, శారీరకంగా ఫిట్ గా ఉంచుతుంది.యోగ యొక్క శక్తి మీ ఆలోచనలను లోపల నుండి బయటకు వెలికి తీస్తుంది. యోగ మరియు ధ్యానం యొక్క నిర్మలమైన శక్తి మీ జ్ఞానమును నిలిపి ఉంచడానికి సహాయం చేస్తుందని అన్నారు.

 

 

 

Post Midle

యోగ అధ్యాపకులు మార్కండేయులు మాట్లాడుతూ…..”యోగకు శరీరం అనువుగా ఉన్న వారు మాత్రమే అనుసరించాలి” అనేది ఒక అపోహ మాత్రమే. యోగ ప్రతి ఒక్కరికోసం, అధిక బరువు లేదా అల్ప బరువు, శరీరం మంచి ఆకృతి లేని వారికి, లింగం లేదా వయసులో తేడా అనే వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరు యోగను చేయవచ్చు. శరీరం సౌకర్యంగా లేని వారికి యోగాసనాల ద్వారా సరిచేసుకోవచ్చు. వీటన్నిటిని కన్నా మనసు సౌకర్యంగా ఉండటం చాలా అవసరం.  యోగను మీరు తప్పక ఇష్టపడతారు ఎందుకంటే, మనసు, తనువును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఉచితము గా యోగ శిక్షణ ఇస్తారని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించు కోవాలని కోరారు.

 

Tags: Healthy living with yoga

Post Midle
Natyam ad