ధాన్యం కుప్పలు దగ్దం
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా మెదక్ మండలం గడమోన్ పల్లి లో వరిధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్నాయి. పొలాల్లో వరి కోయించి గడ్డికి కొంతమంది రైతులు నిప్పు పెట్టారు. ఐకెపి సెంటర్లలో వడ్లు కొనకపోవడంతో పొలాల్లోనే వరి ధాన్యాన్ని కుప్పలుగా పేర్చారు. ఒక్కసారిగా గాలి రావడంతో వరి కుప్పలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకుని రైతులు నీళ్లతో మంటలను ఆర్పివేసారు. ఘటన ధాన్యం స్వల్పంగా కాలిపోయింది.
Tags: Heaps of grain burned

