గుండె కోత..విధి రాత..అంత్యక్రియలకు డబ్బుల్లేక..!

Date:19/07/2019

కటక్‌ ముచ్చట్లు:

అనంత దుఖంలోనూ బొమ్మలు అమ్మాల్సిన దుస్థితి ఆ అమ్మకు కలిగింది. అనారోగ్యంతో మృతిచెందిన ఏడాది వయసున్న కుమార్తె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూడా డబ్బులు లేక మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని బొమ్మలు విక్రయించింది. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది.బక్షిబజార్‌కు చెందిన భారతికి ముగ్గురు కుమార్తెలు.

 

 

 

 

భర్త సుభాష్‌ నాయక్‌ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారతి బక్షిబజార్‌లో రోడ్డు పక్కన బొమ్మలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ముగ్గురు పిల్లలదీ ఐదేళ్లలోపు వయసే. ఏడాది వయసున్న చిన్న కుమార్తె కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సరైన వైద్యం అందక బుధవారం సాయంత్రం తల్లి ఒడిలోనే చిన్నారి కన్నుమూసింది. కుమార్తె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవు. దాంతో కొన్ని బొమ్మలు విక్రయించి వచ్చే డబ్బుతో శ్మశానానికి తీసుకెళ్లొచ్చని తలచిన భారతి కుమార్తె మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని బొమ్మలు విక్రయించింది.

 

 

 

 

ఇది గమనించిన స్థానికులు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. సమాచారాన్ని అధికారులకు తెలిపారు. అధికారులు అక్కడికి వచ్చి శిశువు మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ కార్యక్రమాలు చేయించారు. జిల్లా శిశు సంక్షేమాధికారులు మిగిలిన ఇద్దరు చిన్నారులను బసుంధర ఆశ్రమానికి తరలించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: కోమటిరెడ్డి

Tags: Heart cutting .. Functional writing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *