హృదయాన్ని కదిలించిన ఉప ముఖ్యమంత్రి
చిత్తూరు ముచ్చట్లు:
జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరిన రైతుకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాధాభివందనం చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు. మొరవ కండ్రిగ రైతు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆశించారు. చలించిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆ రైతు పాదాలను తాకి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చర్యతో అందరూ అవాక్కయ్యారు.

Tags: Heart touching Deputy Chief Minister
