విశాఖ నుంచి రేణిగుంటకు గుండె తరలింపు
గ్రీన్ కారిడర్ ఏర్పాటు చేసిన పోలీసులు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ జరిగింది. బ్రెయిన్ డెడ్ పేషెంట్ సన్యాసమ్మ గుండె విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంది. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానల్ కారిడార్ రూట్ ఏర్పాటు చేసారు.తిరుపతి శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ వరకు పోలీసులతో ప్రత్యేక రూట్ ఏర్పాటు, ట్రాఫిక్ రూట్ క్లియరెన్స్ చేసి గ్రీన్ ఛానల్ గా ఏర్పాటు చేసారు. జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి ఆదేశాలతో పోలీసులు సహయక చర్యలు చేపట్టి ఎలాంటి ఆటంకం కలగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పటి వరకు వెయ్యి మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించింది. ఇక్కడ అరుదైన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన నరసయ్య, రాధమ్మల కుమారుడు 15యేళ్ళ విశ్వేశ్వరయ్యకు గుండే అమర్చారు.

Tags:Heart transplant from Visakha to Renigunta
