Natyam ad

అడుగడుగున ఆత్మీయ పలకరింపులు 

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల షిరిడిసాయిబాబా ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ప్రచారాన్ని  తాటిమాకులపాళెం, కోనేటిపాళెం, షిరిడిసాయినగర్‌, హైస్కూల్‌వీధి ప్రాంతాలలో నిర్వహించారు. మంత్రి ప్రచారం విభిన్నరీతిలో సాగింది. ప్రతి చోట ఆత్మీయ పలకరింపులతో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది. పట్టణంలోని ఏవి.రావువీధిలో వృద్ధ దంపతులు ఇంటిలో నుంచి మంత్రిని అప్యాయంగా పలకరించి మాఓట్లు మీకే వేస్తాం అనడంతో మంత్రి చిరునవ్వుతో కరపత్రాలు అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు.  హైస్కూల్‌ వీధిలో పండ్ల వ్యాపారి మహబూబ్‌బాషాకు కరపత్రం ఇచ్చి మంత్రి ఓట్లు వేయమని కోరారు. అలాగే ఫంక్షన్‌లో ఉపాహారం తింటున్న వారి వద్దకు వెళ్లి అభివాదం చేసి ప్రచారం చేశారు. అలాగే టెంకాయల వ్యాపారి నాగమణిని ఓట్లు వేయమని కోరగా అన్న….మీకే ఓట్లు వేస్తామంటు ఆమె టెంకాయ కొట్టి తాగమని మంత్రికి అందజేసింది. సంచులవ్యాపారి రెడ్డెప్పను మంత్రి పలకరించారు. అన్నా…నాకు తెల్లారి నుంచి పెన్షన్‌ ఇవ్వలేదు… నాకు జీవనం కష్టం అనడంతో మంత్రి అతనికి ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఇంటి ముందు కుర్చున్న వృద్ధురాలికి అభివాదం చేసి ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని కోరారు. ఈ విధంగా ప్రచారాన్ని విభిన్న రీతిలో నిర్వహించి, పలువురిని ఆకట్టుకున్నారు.

Post Midle

   

Tags: Heartfelt greetings at every step

 

Post Midle