హీట్ పెంచుతున్న ఎన్టీఆర్ బయోపిక్

Heat Enhanced NTR Biopic
Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 ‘ఎన్టీఆర్ ‘సినిమాలో పోస్టర్ అంచనాలు పెంచేసిస్తుంది. అంచనాల మధ్య స్టార్ట్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం రోజురోజుకి అంచనాలని రెట్టింపు చేస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు.
అసలు ఇందులో రానా చంద్రబాబులా ఎలా ఉంటాడో అన్న ప్రశ్నల మధ్య నిన్న చంద్రబాబు పాత్రకు సంబంధించి ఫస్ట్ లోక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.అచ్ఛం చంద్రబాబులా దిగిపోయిన రానా పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. దానికి తోడు ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇంకో పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ అంటే ఎన్టీఆర్.. రానా అంటే చంద్రబాబు భుజంపై చేయి వేసి ఏదో చెప్పుతున్నట్టు కనిపిస్తుంది. ఆ పోస్టర్ చూస్తూనే వారిద్దరూ ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్లు అర్ధం అవుతుంది.
అల్లుడికి కర్తవ్యం భోధిస్తున్నారా? రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారా? రాజకీయం ఒక రణం లాంటిదని రణక్షేత్రంలో ఎత్తు పైఎత్తు వేయడం తప్పదని ఉద్భోధిస్తున్నారా? సంథింగ్ ఏదో కీలక పరిణామమే.
Tags: Heat Enhanced NTR Biopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *