దేశ రాజధాని ఢిల్లీలో హీట్‌ వేవ్‌ పరిస్థితులు.. 90ఏళ్ల తర్వాత జూలైలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ రాజధాని ఢిల్లీలో హీట్‌ వేవ్‌ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో నగరంలో గురువారం 43.6 డిగ్రీలకు చేరింది. వాతావరణ శాఖ ప్రకారం.. నగర శివారుల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరింది. గత 90 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో గురువారం గరిష్ఠ స్థాయిలో జూలై నెలలో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. జూలై 1, 1931లో నగరంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇంతకు ముందు జూలై 2, 2012న 43.5 డిగ్రీలుగా నమోదైంది. ఇదిలా ఉండగా.. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో హీట్‌ వేవ్‌ పరిస్థితులతో పాటు పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 7వరకు రుతుపవనాలు నగరాన్ని చేరే అవకాశం లేదని ఐఎండీ పేర్కొంది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Heat wave conditions in the national capital Delhi ..
Maximum temperatures in July after 90 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *