వేడెక్కిన వరంగల్ రాజకీయాలు
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్‌లో..రాజకీయాలు మరింత వేడెక్కాయ్..ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు…ప్రదీప్‌రావు విసిరిన సవాల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ…ప్రదీప్‌రావు సవాల్‌ను నన్నపనేని స్వీకరిస్తారా?లేక లైట్ తీసుకుంటారా?అసలు…ఈ వ్యవహారంలో ప్రదీప్‌రావు ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నారు?వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. ఇక ఉరికిచ్చుడే అంటూ తొడగొట్టిన ఎమ్మెల్యే నరేందర్… అటు ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ చేసిన సవాల్‌పై ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి స్వయాన తమ్ముడైన ప్రదీప్ రావు ఇటీవల TRSని వీడారు. ఆ సమయంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్రకు సవాల్ విసిశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి సత్తా నిరూపించుకోగలరా అని ప్రశ్నించారు. దీనికి డెడ్‌లైన్ కూడా పెట్టారు. అయితే, ఈ సవాల్‌ను ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకుంటే… పర్యవసనాలు ఎలా ఉండబోతాయనే చర్చ TRS కార్యకర్తల్లో జరుగుతోంది. తోందర పాటు మాటల వల్లే ఎమ్మెల్యే ఇరుకున పడ్డారనే టాక్ కూడా నడుస్తోంది.తన బర్త్ డే వేడుకల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై పరుష వ్యాఖ్యలు చేశారు నన్నపునేని నరేందర్. దీనిపై ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు ఆయన అనుచర గణం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నెల 7న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ప్రదీప్ రావు… ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. దమ్ముంటే నరేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… ఎన్నికల్లో తనతో తలపడి గెలవాలన్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, ఒక వేళ నరేందర్ తనను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
తన సవాల్‌ను స్వీకరించడానికి మూడు రోజుల డెడ్‌లైన్ పెట్టారు ప్రదీప్. కావాలంటే మరో పది రోజులు సమయం ఇస్తానన్నారు. అయితే, ప్రదీప్ సవాల్ విసిరి మూడు రోజులు ముగుస్తున్నా ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ నుంచి స్పందన లేదు. దీంతో వాల్ పోస్టర్లను అంటిస్తూ వినూత్న ప్రచారానికి తెరలేపారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అనుచరులు.నాడు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాళ్లావేళ్ల పడ్డ నువ్వు, ఈ రోజు స్థాయి మరిచి మాట్లాడుతున్నావంటూ నన్నపనేని నరేందర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలు… లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పంటూ పోసర్లు వేస్తున్నారు. దీంతో వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎర్రబెల్లి, నన్నపునేని అనుచరుల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు మద్దతిచ్చే వాళ్ల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యూహాలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ప్రదీప్ రావు వ్యక్తిగతంగానే పావులు కదుపుతున్నారా? లేక జాతీయ పార్టీలో చేరే ముందు అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ఆడిస్తున్న రాజకీయ చదరంగమా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మధ్యంతర ఎన్నికలు ప్రజలపై భారమంటున్న వారు కొందరైతే బై ఎలక్షన్లు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మరికొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు . ఈ సంఘటనతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు , నన్నపునేని అనుచరుల మధ్య రాజకీయ విభేధాలు తారాస్థాయికి చేరాయి.

Tags: Heated Warangal politics
