కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు

Heathearted politics in Karnataka

Heathearted politics in Karnataka

Date:21/09/2018
బెంగళూర్ ముచ్చట్లు:
కన్నడనాట రాజకీయం వాతావరణం మరోసారి వేడెక్కింది. అధికార జేడీయూ- కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదే పదే కుట్రలు పన్నుతోందంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హసన్ జిల్లా ఉదయగిరిలో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ… డబ్బులతో సర్కారును అస్థిరపరచాలని చూస్తోన్న బీజేపీపై తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పుణ్యభూమి హసన్ నుంచే ఆ ఉద్యమం ప్రారంభించాలని ఆయన కోరారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పదవి నుంచి తప్పుకునేది లేదని, వారి రాజకీయ జిమ్మిక్కులు ఎలో ఎదుర్కోవాలో తనకు తెలుసని కుమారస్వామి ఉద్ఘాటించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ నేత యడ్యూరప్ప ఘాటుగానే స్పందించారు. దేవెగౌడ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని, సర్వనాశనం చేస్తోందని ఆరోపించారు.
జేడీఎస్- కాంగ్రెస్ కూటమికి చెందిన 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తమపై తిరగబడాలని కుమారస్వామి పిలుపునివ్వడాన్ని యడ్యూరప్ప తప్పుబట్టారు. గవర్నర్‌ను కలవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, వారు గవర్నర్ లేదా రాష్ట్రపతిని కలిసినా తమకు ఎలాంటి నష్టం లేదని సీఎం పేర్కొన్నారు.
తమ ప్రభుత్వానికి బీజేపీ అడుగడుగునా అడ్డుతగులుతోందని, అందులో భాగంగానే మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులకు ప్రేరిపించిందని కుమారస్వామి విమర్శించారు. అద్దాలమేడలో ఉండి రాళ్లు వేయాలని చూస్తే నష్టపోయేది మీరేనని, రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని గుర్తుంచుకోవాలని యడ్యూరప్పకు కర్ణాటక సీఎం వార్నింగ్ ఇచ్చారు.
వసూళ్ల వ్యవస్థకు ఆద్యుడు ఆయనేనని, అక్రమార్జన చరిత్ర యడ్డీదేనని విరుచుకుపడ్డారు. కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన యడ్డీ.. కేంద్రంలో మా ప్రభుత్వం ఉందన్న విషయం మీరు కూడా మరిచిపోవద్దంటూ హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యే మనోహర్ నాయకత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులోని యడ్యూరప్ప ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Tags:Heathearted politics in Karnataka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *