నిరుపేదల గుండెచప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు

నిరుపేదల గుండెచప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు

ఆంధ్రప్రదేశ్  ముచ్చట్లు:

– టిడిపి మైనార్టీ నాయకులు అన్వర్ బాషా కితాబు
మదనపల్లె : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిరుపేదల గుండెచప్పుడు,ఆంధ్రుల అభిమాన నాయకుడు అని టిడిపి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా కితాబునిచ్చారు.మంగళవారం పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ ఆదేశాల మేరకు అన్వర్ బాషా ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా అన్వర్ బాషా మాట్లాడుతూ సుమారు 300లకు పైగా చిత్రాల్లో నటించి ప్రజల్లో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నారన్నారు.రాముడు,కృష్ణుడు పాత్రలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు.ప్రజలు తనపై చూపుతున్న అభిమానాన్ని చూసి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న రోజుల్లో ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ సత్తాను ఢిల్లీకి తెలియజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అన్నారు.ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు.ఎన్టీఆర్ ఆశీస్సులతో ఏపీలో మరోసారి తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యాసాగర్,రాజన్న,రామన్న,కేకే వెంకట్ కుమార్,తాజ్ బాషా,జనార్ధన్,తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Heavenly Nandamuri Taraka Rama Rao is the heartbeat of the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *