డిగ్రీ కళాశాల రోడ్డుపై భారీ కేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

Date:17/10/2020

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:

శ్రీ మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కళాశాల రోడ్డుపై స్పీడ్  బ్రేకర్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా ఉపాధ్యక్షుడు బి.మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎస్.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల రోడ్డు పై ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా మహేంద్ర మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణం నుండి ఆదోనికి పోవు దారిలో ఉన్న ఎస్.ఎం.ఎల్ డిగ్రీ కళాశాలకు నిత్యం విద్యార్థులు, లెక్చరర్లు కళాశాలకు వెళ్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో వాహన యాక్సిడెంట్లు జరిగాయని, విద్యార్థులు కూడా మరణం చెందారని అన్నారు. గతంలో చాలా సార్లు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థి, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రోడ్డు రవాణా సంస్థ అధికారులు స్పందించి ఎస్.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల ముందు బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ దారిలో వెళ్తు ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వ అదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాలూకా అధ్యక్షుడు రామకృష్ణ,పట్టణ కార్యదర్శి సమీర్,శివ, గిరీష్, నరసింహ, ఆదం,ఖాసిం తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

 ఆర్టీసీ డిపోలో కోవిద్  పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

Tags: Heavy caddies and speed breakers should be installed on the degree college road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *