జపాన్ లో భారీగా కరోనా కేసులు

టక్యో  ముచ్చట్లు:
టోక్యో ఒలింపిక్స్ ముంగిట జపాన్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ జపాల్‌లోని టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనుండగా.. త్వరలోనే అక్కడికి వందలాది క్రీడాకారులు చేరుకోనున్నారు. కానీ.. గత వారం నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం టోర్నీ నిర్వాహకుల్లో కంగారు పెంచుతోంది.వాస్తవానికి జూన్ 21 వరకూ టోక్యోలో ఎమర్జెన్సీ ఉంది. అయితే.. టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో.. దాన్ని ఎత్తివేయగా.. అప్పటి నుంచి క్రమంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. బుధవారం ఒక్కరోజే జపాన్‌లో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కావడం గమనార్హం. గత వారం వరకూ రోజుకి సగటున 500 వరకూ వచ్చిన కేసులు.. క్రమంగా రెట్టింపవుతున్నాయి.ఓవరాల్‌గా చూసుకున్నా.. జపాన్‌లో నమోదవుతున్న కేసుల్లో ఏకంగా 40 శాతం కేసులు టోక్యోలోనే నమోదవుతున్నాయి. దాంతో.. ఒలింపిక్స్ నిర్వహణ కత్తిమీద సాములా కనిపిస్తోంది. మే 26 తర్వాత అక్కడ రోజులో 700 కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Heavy corona cases in Japan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *