పుంగనూరులో వడగండ్ల వానకు భారీ నష్టం -381 ఎకరాల్లో పంట నష్టం
-నేలరాలిన మామిడి, టమోటా
-సుమారు రూ. 5 కోట్ల మేర ఆస్తి నష్టం
– డీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:

పడమటి నియోజకవర్గంలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా గాలి, వడగండ్ల వాన పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రాళ్లతో సమానంగా ఉన్న వడగండ్లు పడటం చాలా అరుదైన సంఘటనగా రైతులు తెలిపారు. ఈ వడగండ్ల వానకు టమోటా, మామిడి, ఇతర కూరగాయల పంటలు నేలరాలింది. అలాగే పలు లోతట్టు ప్రాంతాలో పంటలలో నీరు నిల్వ చేరింది. దీని కారణంగా సుమారు 450 ఎకరాలలో దెబ్బతింది. ఆదివారం జిల్లా ఉధ్యానవనశాఖాధికారి మధుసూదన్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ సంతోషికుమారి కలసి పుంగనూరు నియోజకవర్గం, పంజాణి, గంగవరం మండలాల్లో పర్యటించి, రైతులతో చర్చించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరిశీలన చేసి నివేదికలు ప్రభుత్వానికి పంపి, రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని సింగిరిగుంట, ఏతూరు, నెక్కుంది. బండ్లపల్లె, మాదనపల్లె పంచాయతీలలో మామిడి, టమోటాతో పాటు కాలిప్లవర్ తదితర పంటలకు తీవ్ర నష్టమైందని హెచ్‌వో తెలిపారు. కాగా పంటనష్టాలపై తక్షణమే పరిశీలన జరిపి , అన్ని మండలాల నుంచి రైతుల జాబితాలను సిద్దం చేయాలని ఆదేశించామన్నారు. నివేదికలను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. ఎన్నడు లేని విధంగా వడగండ్లతో కూడిన వర్షాలు రావడంతో పంట తీవ్రంగా దెబ్బతినిందని తెలిపారు.
Tags;Heavy damage due to hailstorm in Punganur – crop loss in 381 acres
